Vital Information Resources Under Seize

ఈ V I R U S అనేది ఒక సాప్ట్ వేర్ మాత్రమే. దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రస్తుతం మన కంప్యూటర్ లో ఉన్న సమాచారాన్ని, డేటాని నాశనం చేయటం. ప్రస్తుతం ఉన్న కంప్యూటర్లన్నీ ఏదో ఒక VIRUS తో ఇబ్బంది పడుతున్నవే. అందులోను ఈ VIRUS అనేది కేవలం ఒక చోట ఉండదు. ఇంతకు ముందు రోజులలో అయితే కేవలం డిస్క్ లో O th track లో ఉండి సమాచారాన్ని పాడు చేస్తూండేది. కాని తర్వాత కంప్యూటర్ రంగం అభివృద్ధితో పాటు ఈ VIRUS సాప్ట్ వేర్ లోనూ అభివృద్ధి జరిగింది. ప్రస్తుతం ఉన్న VIRUS లు కేవలం డిస్క్ లో ఒక చోట మాత్రమే ఉండవు. అది ఎక్కడ ఉన్నదీ తెలుసుకోవటం చాలా కష్టం అవుతున్నది. ఎక్కడ ఉన్నదో అది తెలుసుకోగలిగినప్పటికి తనంతట తానుగా దాక్కోగలిగిన సామర్థ్యం ఈనాటి VIRUS సాప్ట్ వేర్ లలో ఉన్నది.
ముఖ్యంగా VIRUS ఎలా మొదలైనది ఇప్పడు తెల్సుకుందాము. ఈ VIRUS అనేది లాటిన్ పదమైన ‘‘VIRON’’ అనే పదం నుంచి ఉద్భవించింది. ఈ VIRON అనే Latin పదానికి ‘‘విషం’’ అని అర్థం. ఈ VIRUS అనేది పొడి అక్షరాలు, అంటే V...I...R...U...S అనేవి వేరు వేరు పదాలు. ఆ పదాలలోని మొదటి అక్షరాలు తీసుకుని ఈ పదాన్ని తయారు చేశారు. ఈ VIRUS యొక్క పూర్తి పేరు Vital Information Resources Under-Seize అంటే ముఖ్య సమాచారాన్ని పాడుచేయటం అని అర్థం.
మొట్టమొదటగా ఈ VIRUS ని 1972 వ సంవత్సరంలో ఇజ్రాయిల్ దేశంలో ఒక కంప్యూటర్ సంస్థలో కనుగొనడం జరిగింది. ఆ సంస్థలో ఒక ఉదయం కంప్యూటర్లు ఆన్ చేసిన వెంటనే స్క్రీన్ మీద నల్లని చుక్కలు తప్పితే ఇంకేమీ కనపడలేదు. తర్వాత ఈ VIRUS కి Jerusalem Blackhole VIRUS అని నామకరణం చేశారు.


VIRUS Classification :


సమాచారాన్ని పాడుచేసేవి అన్నీ వైరస్ సాప్ట్ వేర్లు కావు. తనంతట తానుగా విస్తరించ కలిగిన వాటిని మాత్రమే వైరస్ లు అంటారు. వీటిని ముఖ్యంగా మూడు విభాగాలుగా చేయవచ్చు. అవి (1) టైం బాంబ్ (Time Bomb) 2) ట్రాజాన్ హార్సెస్ (Trojan Horses) 3) వైరసెస్ (Viruses).
1)Time Bomb : ఇది చాలా చిన్న ప్రోగ్రామ్. ఇది మామూలు Time Bomb పని చేసినట్టు పని చేస్తుంది. అంటే నిర్థేశించిన తేదీకి, నిర్థేశించిన సమయానికి వినాశనాన్ని ప్రారంభిస్తుంది. కాని ఇతర వినాశకార సాప్ట్ వేర్ల లాగా తనంతట తానుగా విస్తరించే వక్తి లేదు.
2) Trojan Horse : వీటితో ఒక చిన్న చిక్కు ఉన్నది. ఇవి మనకు అనుమానం కలిగే విధంగా ప్రవర్తిస్తాయి. కాని ఆ మార్గంలో కాక ఇంకొక మార్గంలో సమాచారాన్ని పాడు చేస్తాయి. ఇవి సాధారణంగా మనల్ని తప్పుదారి పట్టిస్తాయి. కొన్ని కొన్ని సార్లు ఏదైనా కండిషన్ పూర్తి అయినప్పుడు వాటంతటవే స్క్రీన్ మీద ‘‘Thrasling your Hard disk’’ అన్న సమాచారాన్ని ఇస్తాయి, కాని ఏమీ చేయదు. దీనిలో ఒక్క ఉపయోగం ఏమంటే దానంతటది విస్తరించదు.
3) Viruses వైరస్ అనేది మామూలుగా మెమరీలో నిల్వ చేయబడి ఉంటుంది. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కోసం తయారు చేసిన వైరస్ ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ మీద పని చేయదు. దానంతటదే విస్తరించి ఇతర ప్రోగ్రామ్ లను, ఫైల్స్ ను నాశనం చేస్తుంది.


వైరస్ లో నాలుగు ముఖ్య భాగాలు :
1) Code Install : ఇది ముఖ్యంగా కంప్యూటర్ మెమరీలోకి పంపటానికి ఉపకరిస్తుంది. ఇదే ఎక్సిక్యూటబుల్ ఫైల్స్ కి వైరస్ ని కలిపే పని కూడా ఈ భాగమే చేస్తుంది.
2) Code Copy : ఇది ముఖ్యంగా వైరస్ ని డిస్క్ లో నిల్వ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ స్టాల్ చేసేటప్పుడు ఎక్సిక్యూటబుల్ ఫైల్స్ కి ఎపెండ్ చేస్తుంది.
3) Code Check : ఫైల్ స్ట్రక్టర్ లో ఒక path లో infection ని తయారు చేసే ఈ సాఫ్ట్ వేర్ ముందుగా నిర్థేశించిన మార్గాన్ని అవలంభించి కంట్రోల్ ని నెక్ట్స్ స్టేజికి అందజేస్తుంది.
4) Trojan : ఇది అత్యంత ముఖ్యమైన దశ. ఈ దశలోనే అసలు వినాశనం జరుగుతుంది. ఇంతకు ముందు దశలో పూర్తిగా నిర్థేశించిన విధంగా జరిగితే ఈ దశలో తన పనిని ప్రారంభిస్తుంది.




TYPES OF VIRUSES వైరస్ రకాలు :
ముఖ్యంగా వైరస్ లు మూడు రకాలు. అవి :
1. File Virus 2. Boot Sector 3. Stealth Virus.

1. File Virus : ముఖ్యంగా ఈ వైరస్ executable (.Exe) files ని ఎటాక్ చేస్తుంది. ఎప్పుడైతే మనం .Exe file Execute చేస్తామో అప్పుడు ఈ వైరస్ కూడా Execute అయి files ని పాడుచేయడం మొదలు పెడుతుంది.
2. Boot Sector Virus : ఇది ముఖ్యంగా ఆపరేటింగ్ సిస్టమ్ పాడు చేసే వైరస్. Boot Sector అనేది డిస్క్ మీద ఆపరేటింగ్ సిస్టమ్ నిల్వ చేసే స్థానం. అక్కడ ఈ వైరస్ చేరి ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ ని పాడు చేస్తుంది. అప్పుడు అస్సలు కంప్యూటర్ Boot అయ్యే అవకాశమే ఉండదు.
3. Stealth Virus : ఈ రకం వైరస్ మహా ప్రమాదకరమైనది. ఇతర రకాల వైరస్ లను వివిధ పద్ధతుల ద్వారా కనుగొని నిర్మూలించగలుగుతాము. కాని దీనిని కనుగొనటమే ఒక పెద్ద సమస్య.
ముఖ్యంగా ఏ వైరస్ అయినా attack అవ్వగానే ఆ file size విపరీతంగా పెరుగుతుంది. దీనిని ఆధారం చేసుకునే ఏ వైరస్ ని కనుగొనే పద్ధతైనా పని చేస్తుంది. కాని ఈ stealth virus అనేది ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంభించి పెరిగిన file size ని తెలియకుండా జేస్తుంది. అది ఎలా జరుగుతోందో ఇప్పుడు తెలుసుకుందాము...
ఈ వైరస్ అటాక్ అయిన ఫైల్ సైజ్ కి 9216 bytes కలుపుతుంది. షుమారుగా మామూలుగా file size 50 bytes అనుకోండి. అప్పుడు మొత్తం size 9266 గా మారుతుంది. అప్పుడు అసలు file లోని సమాచారాన్ని తీసేసి వైరస్ కి సంబంధించిన సమాచారాన్ని ఆ 50 bytes స్థానంలో ఉంచుతుంది. తర్వాత మొత్తంలో నుంచి ఇంతకు ముందు కలిపిన 9216 bytes ని తీసేస్తుంది. ఇప్పుడు file size కేవలం 50 bytes మాత్రమే కానీ file లో వైరస్ కి సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ విధంగా తనని కనుగొనే విధానానికి అందకుండా ఈ Virus పని చేస్తుంది.



వైరస్ కనుగొనే విధానాలు :


1) CRC - Cycle Redmdoney check అనే ఒక algorithm ద్వారా ఈ virus కనుగొని తొలగించవచ్చు.
2) Scanner ఈ స్కానర్స్ ప్రతిసారీ మనం file ని Execute చేసేముందు hard disk లేదా floppy disk చెక్ చేయడం ద్వారా వైరస్ ని కనుగొంటాయి. ఉదా : Mcfee virus scanner, Norton Antivirus ఇలా చాలా సాఫ్ట్ వేర్ లు ఉన్నాయి.
3) Antidotes ఇవి కూడా వైరస్ ను కనుగొనే సాధనాలే. ఇవి ముఖ్యంగా Virus వినాశనానికి ఉపయోగిస్తారు. ఉదా : Smart Dog & UTRes.

మరి ఇన్ని విషయాలు తెలుసుకున్నాము కదా.... మరి

వైరస్ ను నివారించడం ఎలా...????

1) ముఖ్యంగా Booting అనేది Hard Disk నుంచి లేదా వైరస్ లేని disk నుంచి (floppy నుంచి ఒకప్పటి మాట. ఎందుకంటే...ప్లాఫీ ఇప్పుడు సారీ...!!) చెయ్యటం మంచిది.
2) ఎక్కువగా Back-up తీసుకోవటం ద్వారా. ఒక వేళ వైరస్ వచ్చినా దానిని Clean చేసి ఈ Back up నుంచి డేటాను తీసుకోవచ్చు.
3) ఎప్పుడైనా authorized software తీసుకోవడం ద్వారా ఈ వైరస్ ను నివారించవచ్చు.
4) ముఖ్యంగా ఎప్పుడు కూడా సిస్టమ్ updation అనేది వైరస్ attack అయ్యే రోజులలో చెయ్యటం నివారించాలి. ఉదా : Friday 13th.
5) ఎవరు కూడా తమ సిస్టమ్ ఇంకొకరు వాడకుండా చూచుకోవాలి.
6) పెన్ డ్రైవ్ లను సాధ్యమైనంతవరకూ అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో స్కానింగ్ జరిపిన తరువాత మాత్రమే సిస్టమ్ లోనికి అనుమతించాలి.