News
జగన్ ఆస్తులపై హైకోర్టుకు సీబీఐ నివేదిక
అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సీబీఐ అధికారులు మీడియా కంటబడకుండా ఇద్దరు స్కూటర్*పై హైకోర్టుకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్*రెడ్డి అక్రమాస్తులపై నివేదిక సమర్పించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్*రెడ్డి అక్రమాస్తులపై సీబీఐ అధికారులు రెండు వారాలపాటు పూర్తిస్థాయి ప్రాథమిక విచారణ జరిపి, రేయింబవళ్లు కసరత్తు చేసి మంగళవారం హైకోర్టుకు నివేదిక సమర్పించారు. 23 కంపెనీల ప్రతినిధులను విచారించి వారి వద్ద నుంచి సేకరించిన వివరాలను నివేదిక రూపంలో సీల్డ్ కవరులో పెట్టి హైకోర్టు రిజిష్ట్రార్*కు అందజేశారు. జగన్ ఆక్రమాస్తులకు సంబంధించి, ఎమ్మార్ వ్యవహారానికి సంబంధించి మొత్తం రెండు నివేదికలను సమర్పించారు. కాగా ఈ నివేదికలను అందజేశారు.
0 comments:
Post a Comment